ఈశాన్య రాష్ట్రాల్లో హైవేల పరిస్థితి ఏంటి ? | Highways in the Northeast, what is the situation? | Sakshi
Sakshi News home page

ఈశాన్య రాష్ట్రాల్లో హైవేల పరిస్థితి ఏంటి ?

Dec 18 2014 1:11 AM | Updated on Sep 2 2017 6:20 PM

ఈశాన్య రాష్ట్రాల్లో హైవేల పరిస్థితి ఏంటి ?

ఈశాన్య రాష్ట్రాల్లో హైవేల పరిస్థితి ఏంటి ?

ఏసియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు(ఏడీబీ) సహా యంతో ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల్లో చేపట్టిన జాతీయ రహదారులు ఎప్పటిలోగా పూర్తి అవుతాయని...

  • పార్లమెంట్‌లో ఎంపీ పొంగులేటి
  • సాక్షి, ఖమ్మం: ఏసియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు(ఏడీబీ) సహా యంతో ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల్లో చేపట్టిన జాతీయ రహదారులు ఎప్పటిలోగా పూర్తి అవుతాయని, ప్రస్తుతం అవి ఏ దశలో ఉన్నాయని వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం పార్లమెంట్‌లో  ప్రశ్నించారు.  

    కేంద్ర ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి (స్వతంత్ర ప్రతిపత్తి) డాక్టర్ జితేంద్రసింగ్ సమాధానమిస్తూ ఈ బ్యాంకు నిధులతో అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, సిక్కిం, త్రిపుర రాష్ట్రాల్లో సుమారు 433 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు వేస్తున్నట్లు వివరించారు. వీటికి రూ. 1,353 కోట్ల మేర ఖర్చు అవుతుందన్నారు.
     

Advertisement
 
Advertisement
Advertisement