మసాయిపేట ఘటన: నలుగురు విద్యార్థుల పరిస్థితి విషమం | Four students health critical says yashoda hospital doctors | Sakshi
Sakshi News home page

మసాయిపేట ఘటన: నలుగురు విద్యార్థుల పరిస్థితి విషమం

Jul 27 2014 12:59 PM | Updated on Oct 16 2018 3:12 PM

మెదక్ జిల్లా మాసాయిపేట బస్సు ఘటనలో గాయపడిన విద్యార్థుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

హైదరాబాద్: మెదక్ జిల్లా మాసాయిపేట బస్సు ఘటనలో గాయపడిన విద్యార్థుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఆదివారం విద్యార్థుల ఆరోగ్యంపై యశోద ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. వరుణ్ గౌడ్, వైష్ణవి, ప్రశాంతి, తరుణ్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. మరో నలుగురు విద్యార్థులను ఐసీయూలో అబ్జర్వేషన్లో ఉంచామన్నారు. ఎనిమిది విద్యార్థులను సాధారణ వార్డుకు తరలించినట్లు చెప్పారు. మరో నలుగురిని సాయంత్రంలోగా సాధారణ వార్డుకు తరలిస్తామన్నారు.  

 

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేటలో గురువారం ఉదయం కాపలాలేని రైల్వే క్రాసింగ్ వద్ద రైలు పట్టాలపైకి వచ్చిన స్కూల్ బస్సును నాందేడ్ ప్యాసింజర్ ట్రైన్ ఢీ కొట్టింది. ఆ దుర్ఘటనలో విద్యార్థులతోపాటు బస్సు డ్రైవర్, క్లీనర్ మొత్తం 16 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో గాయపడిన విద్యార్థులు హైదరాబాద్ నగరంలోని యశోదా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement