తహశీల్దారు కార్యాలయంలో రైతు ఆత్మహత్యాయత్నం | farmer attempts suicide at mro office | Sakshi
Sakshi News home page

తహశీల్దారు కార్యాలయంలో రైతు ఆత్మహత్యాయత్నం

Apr 13 2015 5:50 PM | Updated on Oct 1 2018 2:44 PM

తహశీల్దారు కార్యాలయంలో ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు.

తూప్రాన్ :తహశీల్దారు కార్యాలయంలో ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన బత్తుల సత్యన్నారాయణ(55) అనే రైతు తన భూమి వివరాలను రికార్డుల్లో నమోదు చేయడంలేదని ఆరోపిస్తూ సోమవారం తహశీల్దారు కార్యాలయంలో పురుగుమందు తాగాడు.

 

దీంతో అతడిని హుటాహుటిన సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement