కూతురికి మాటలు రావట్లేదని.. తల్లి తీవ్ర నిర్ణయం! | Housewife Commits Suicide In Gachhibowli Hyderabad | Sakshi
Sakshi News home page

కూతురికి మాటలు రావట్లేదని.. తల్లి తీవ్ర నిర్ణయం!

Jul 5 2026 8:37 AM | Updated on Jul 5 2026 11:52 AM

Housewife Commits Suicide In Gachhibowli Hyderabad

12వ అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య

హైదరాబాద్‌, గచ్చిబౌలి: గచ్చిబౌలి  పోలీస్‌ స్టేషన్‌పరిధిలో ఓ గృహిణి 12వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ బాలరాజు తెలిపిన మేరకు.. బిహర్‌కు చెందిన ఆర్కిటెక్ట్‌ అన్మోల్‌ కుమార్, అపర్ణ అన్మోల్‌ అరుణ్‌(36) దంపతులు కొండాపూర్‌ ఎస్‌ఎంఆర్‌ వినయ్‌ ఐకానియాలో నివాసం ఉంటున్నారు.

శుక్రవారం రాత్రి అపర్ణ 12వ అంతస్తునుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. వీరి ఆరేళ్ల కుమార్తె ఆటిజంతో బాధపడుతోంది. కుమార్తెకు మాటలు రాకపోవడంతో అపర్ణ తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉంది. ఈ క్రమంలోనే ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కుమార్తె విషయంలో భార్యా భర్తలకు గొడవ జరగడంతో బలవన్మరణం చెందినట్లుపోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement