‘డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలి’ | DSC notification should be relased in Telangana state | Sakshi
Sakshi News home page

‘డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలి’

Dec 10 2014 7:56 AM | Updated on May 25 2018 5:44 PM

ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణతో సంబంధం లేకుండా వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్‌ను జారీ చేయాలని తెలంగాణ రాష్ట్ర డీఎస్సీ అభ్యర్థుల సంఘం డి మాండ్ చేసింది.

సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణతో సంబంధం లేకుండా వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్‌ను జారీ చేయాలని తెలంగాణ రాష్ట్ర డీఎస్సీ అభ్యర్థుల సంఘం డిమాండ్ చేసింది. మంగళవారం టీటీజేఏసీ సమావేశం సందర్భంగా పలువురు నిరుద్యోగులు అక్కడికి వచ్చారు. టీటీజేఏసీ తరపున డీఎస్సీ నోటిఫికేషన్ జారీ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు.

ఈ సందర్భంగా టీటీజేఏసీ చైర్మన్ వెంకట్‌రెడ్డికి విజ్ఞాపన పత్రం అందజేశారు. ఉపాధ్యాయుల రేషనలైజేషన్ పేరుతో నోటిఫికేషన్ జారీలో జాప్యం చేస్తోందని, ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement