రసాభాసగా ఐటీడీఏ సమావేశం | Disputes Regarding ITDA Meeting In Adilabad | Sakshi
Sakshi News home page

రసాభాసగా ఐటీడీఏ సమావేశం

Oct 30 2019 7:37 PM | Updated on Oct 30 2019 8:46 PM

Disputes Regarding ITDA Meeting In Adilabad - Sakshi

ఆదిలాబాద్‌: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఐటీడీఏ పాలకవర్గ సమావేశం బుధవారం రసాభాసగా జరిగింది. ఈ సమావేశంలో ఎంపీ సోయం బాపూరావు తనపై చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి జోగు రామన్న పట్టుబట్టారు. దీంతో చేసేదేమిలేక సోయం బాపురావు వ్యాఖ్యలపై ఆత్రం సక్కు క్షమాపణ కోరారు. దీంతో ఐటీడీఏ సమావేశంలో రాజకీయాలు ఎలా ప్రస్తావిస్తారని బాపురావు ప్రశ్నించారు. తాను క్షమాపణ చెప్పేది లేదంటూ సమావేశం నుంచి బాపూరావు వెళ్లిపోయారు.

మరోవైపు ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌లో కూడా బుధవారం ఐటీడీఏ పాలకవర్గ సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశంలో ‘తుడుం దెబ్బ’ ఆందోళనకారులు బయటకు వచ్చి లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. అదే విధంగా ఆదివాసి తుడుందెబ్బ నాయకులు కొమరం భీం కాంప్లెక్స్‌ గేట్‌ ముందు ధర్నా చేశారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement