రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం | Couple killed in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం

May 1 2016 2:23 AM | Updated on Jul 10 2019 8:00 PM

రోడ్డు ప్రమాదంలో దంపతులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన మండలంలోని నాతాళ్లగూడెం శివారులో శనివారం చోటుచేసుకుంది.

 వలిగొండ : రోడ్డు ప్రమాదంలో దంపతులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన మండలంలోని నాతాళ్లగూడెం శివారులో శనివారం చోటుచేసుకుంది.  పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి మండలం తుక్కాపురం గ్రామానికి చెందిన రాసాల సోములు(45), జయమ్మ(40) దంపతులు రామన్నపేట మండలం నీ ర్నెముల గ్రామంలో జరిగిన బొడ్రా యి ప్రతిష్ఠాపన వేడుకలకు వెళ్లారు. పండుగ అనంతరం సాయంత్రం బైక్‌పై తుక్కాపురం బయలుదేరారు.
 
 నాతాళ్లగూడెం శివారులో చి ట్యాల నుంచి భువనగిరి వైపు వెళ్తున్న లా రీ వీరి బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దంపతులు అక్కడికక్కడే మృతిచెం దా రు. వారికి  కుమారుడు, కుమార్తె ఉ న్నారు.  సమాచారం తెలుసుకున్న స్థానిక ఎస్‌ఐ డి.వెంకటేశ్వర్లు సంఘటన స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను రామన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతదేహాల వద్ద వారి పిల్లలు రోదిస్తున్న తీరు అం దరినీ కంటతడి పెట్టించింది.
 

Advertisement
 
Advertisement
Advertisement