కరోనాతో కాంగ్రెస్‌ నేత నరేందర్‌ యాదవ్‌ మృతి | Congress Leader Narendra Yadav Passed Away With Coronavirus | Sakshi
Sakshi News home page

కరోనాతో కాంగ్రెస్‌ నేత నరేందర్‌ యాదవ్‌ మృతి

Jul 14 2020 5:10 AM | Updated on Jul 14 2020 5:10 AM

Congress Leader Narendra Yadav Passed Away With Coronavirus - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, టీపీసీసీ కార్యదర్శి, హైదరాబాద్‌ నగర కాంగ్రెస్‌ పార్టీలో కీలక నాయకుడు నరేందర్‌ యాదవ్‌ (కడియం) కరోనా బారిన పడి మృతి చెందారు. ఇటీవల కరోనా పాజిటివ్‌ వచ్చిన ఆయన యశోదా ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందారని గాంధీభవన్‌ వర్గాలు వెల్లడించాయి. నరేందర్‌ యాదవ్‌ మృతిపై టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎ ల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు పలువురు నేతలు సంతాపం తెలిపారు.

పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌.సి.కుంతియా, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎ.రేవంత్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమ కుమార్, ఏఐసీసీ కార్యదర్శులు శ్రీనివాస కృష్ణన్, సంపత్‌ కుమార్, వంశీచంద్‌æ రెడ్డి తదితరులు విచారం వ్యక్తంచేశారు. నగర కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో నరేందర్‌కు శ్రద్ధాంజలి ఘటించారు. నగర పార్టీ అధ్యక్షుడు అంజన్‌ కుమార్‌ యాదవ్‌ తదితరులు ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నరేందర్‌ మృతి పార్టీకి తీరని లోటని, పార్టీ క్రమశిక్షణ గల సైనికుడిని కోల్పోయిందని విచారం వెలిబుచ్చారు. 

Advertisement
 
Advertisement
Advertisement