బతుకమ్మ చీరల పంపిణీపై ఈసీకి కాంగ్రెస్‌ ఫిర్యాదు | Congress complaint to ec on Bathukamma Sarees Distribution | Sakshi
Sakshi News home page

బతుకమ్మ చీరల పంపిణీపై ఈసీకి కాంగ్రెస్‌ ఫిర్యాదు

Sep 29 2018 3:15 AM | Updated on Mar 18 2019 9:02 PM

Congress complaint to ec on Bathukamma Sarees Distribution - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బతుకమ్మ చీరల పంపిణీపై కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. శుక్రవారం కాంగ్రెస్‌ కోశాధికారి, ఏఐసీసీ సభ్యుడు గూడూరు నారాయణ రెడ్డి ఈ విషయంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌కు లేఖ రాశారు. బతుకమ్మ పండుగను పురస్కరించుకుని ఆపద్ధర్మ ప్రభుత్వం చీరలు పంపిణీ చేయనుందని ఈ కార్యక్రమంలో మంత్రులు, టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు పాల్గొననున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఆపద్ధర్మ ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకే వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని టీఆర్‌ఎస్‌ నేతలు, మంత్రులు కాకుండా అధికారులే చేపట్టేలా ఈసీ పర్యవేక్షించాలని ఫిర్యాదులో కోరారు. చీరల పంపిణీ సమయంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫొటో లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement