అందెశ్రీ, గద్దర్‌ లేకుండా సభలా? | cheruku sudhakar on kcr | Sakshi
Sakshi News home page

అందెశ్రీ, గద్దర్‌ లేకుండా సభలా?

Dec 15 2017 3:11 AM | Updated on Aug 15 2018 9:40 PM

cheruku sudhakar on kcr - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచం తెలంగాణ వైపు చూడాలనే ఆకాం క్షతో ప్రారంభం కానున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో తెలుగు సాహిత్యానికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు డాక్టర్‌ చెరుకు సుధాకర్‌ డిమాండ్‌ చేశారు. అందెశ్రీ, జూకంటి జగ న్నాథం, గద్దర్, ఏపూరి సోమన్న, విమలక్క, ఎక్కా యాదగిరిరావు వంటి కవుల్ని పిలవ కుండా ప్రపంచ తెలుగు మహాసభలను ఎలా నిర్వహిస్తారని నిలదీశారు.

గురువారం ఆయన హైదరాబాద్‌లో పార్టీ కార్యాలయం లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మెట్రోరైల్‌ ప్రారంభ సమయంలో దాంతో కేసీఆర్‌కు, కేటీఆర్‌కు ఏ సంబంధం లేదని.. శంకుస్థాపన జరిగాక మెట్రోను అడ్డుకోవాలని బహిరంగ సభల్లో చెప్పారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు అదే కేసీఆర్‌ మెట్రో డెవలప్‌మెంట్‌ను చూసి ఇదంతా తామే చేశామని సొంత డబ్బా కొట్టుకుంటున్నారని అన్నారు.

మూసీ ఈస్ట్‌–వెస్ట్‌ కారిడార్‌ ఏది?
కేసీఆర్‌ 12 జంక్షన్లతో 41 కి.మీ. పొడవున ఆరు లైన్లతో మూసీ నది వెంబడి ఈస్ట్‌ –వెస్ట్‌ కారిడార్‌ను నిర్మిస్తామన్నారని, ఆ కారిడార్‌ ఏమైందని ప్రశ్నించారు. రూ. 5,916 కోట్లతో స్కైవేలు నిర్మిస్తామన్న  కేసీ ఆర్‌ కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. కొత్తగూడెం జిల్లాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌ సీఎం కేసీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా జరిగిందన్నారు. ఈ నెల 18న సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్‌టేబుల్‌ సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు.   అంతకు ముందు తెలంగాణ లేబర్‌ పార్టీ యాదాద్రి జిల్లా అధ్యక్షులు ముత్యాల శ్రీరాములు తెలంగాణ ఇంటి పార్టీ లో చేరారు.  

Advertisement
 
Advertisement
Advertisement