మూడెకరాల నుంచి ఎకరానికి తగ్గింపు | Changes in Agricultural Degree Entrance Eligibility | Sakshi
Sakshi News home page

మూడెకరాల నుంచి ఎకరానికి తగ్గింపు

Mar 8 2018 12:56 AM | Updated on Jun 4 2019 5:16 PM

Changes in Agricultural Degree Entrance Eligibility - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ వర్సిటీలో ప్రవేశానికి ప్రస్తుతమున్న నిబంధనల్లో కొన్ని మార్పులు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ డిగ్రీ కోర్సుల్లో 40 శాతం సీట్లను గ్రామీణ ప్రాంతాల రైతు పిల్లలకు రిజర్వేషన్‌ కల్పించారు. కనీసం మూడెకరాలున్న వారికి మాత్రమే ఆ 40 శాతంలో సీట్లు లభించేవి. దాన్ని ఎకరానికి కుదిస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నేడో రేపో ఉత్తర్వులు రానున్నాయి.

49 మందిపై మాల్‌ ప్రాక్టీస్‌ కేసులు
సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్‌ పరీక్షల్లో భాగంగా బుధవారం జరిగిన ద్వితీయ సం వత్సర పరీక్షల్లో 49 మంది విద్యార్థులపై మాల్‌ ప్రాక్టీస్‌ కేసులు నమోదయ్యాయి. మ్యాథ్స్‌–2ఏ, బోటనీ, సివిక్స్, సైకాలజీ పేపరు–2 సబ్జెక్టులకు జరిగిన పరీక్షలకు 4,37,572 మంది హాజరయ్యారు. 4,57,292 మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు రిజిస్టర్‌ చేసుకోగా, అందులో 19,720 మంది గైర్హాజరయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement