తెలంగాణ బీజేపీ నేతకు కరోనా పాజిటివ్‌ | BJP Leader Tests Positive Corona | Sakshi
Sakshi News home page

తెలంగాణ బీజేపీ నేతకు కరోనా పాజిటివ్‌

Jun 1 2020 7:43 PM | Updated on Jun 1 2020 8:23 PM

BJP Leader Tests Positive Corona - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఒకరు కరోనా వైరస్‌ బారినపడ్డారు. ఖైరతాబాద్‌ నియోజకవర్గంలోని మాజీ ఎమ్మెల్యేకు కరోనా లక్షణాలు కనిపించడంతో సోమవారం జూబ్లీహిల్స్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్చారు. శాంపిల్స్‌ను పరీక్షించగా పాజిటీవ్‌ వచ్చింది. దీంతో ఆయన కుటుంబ సభ్యుల రక్తనమూనాలను సేకరించి పరీక్షలకు పంపించారు. ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచి ఆయన ప్రజల్లో ఉంటూ నిత్యం నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి కరోనా సోకి ఉంటుందని భావిస్తున్నారు. ఇక ఇప్పటికే ఆ కుటుంబంలోని మిగతా సభ్యుల రక్తనమూనాలను పరీక్షలకు పంపడంతో పాటు వారిని క్వారంటైన్‌ చేశారు. మాజీ ఎమ్మెల్యేకు కరోనా వచ్చిందన్న విషయం బయటికి రావడంతో నియోజక వర్గంలో కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. తన ఆరోగ్యం నిలకడగా ఉందని త్వరలోనే క్షేమంగా బయటికి వస్తానని ఆయన ఓ ముఖ్య నేతతో ఫోన్‌లో మాట్లాడి సమాచారం కార్యకర్తలకు చేరవేశారు. (దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న మహమ్మారి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement