కోటగిరిలో బీడీ కార్మికుల ఆందోళన | Bidi Workers stages Dharna at Kotagiri MRO Office | Sakshi
Sakshi News home page

కోటగిరిలో బీడీ కార్మికుల ఆందోళన

May 25 2015 5:26 PM | Updated on May 29 2018 2:59 PM

కోటగిరిలో బీడీ కార్మికుల ఆందోళన - Sakshi

కోటగిరిలో బీడీ కార్మికుల ఆందోళన

నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని ఎమ్మార్వో ఆఫీసు ఎదుట సోమవారం బీడీ కార్మికులు ఆందోళన చేపట్టారు.

కోటగిరి : నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని ఎమ్మార్వో ఆఫీసు ఎదుట సోమవారం బీడీ కార్మికులు ఆందోళన చేపట్టారు. అర్హులైన బీడీ కార్మికులందరికీ పింఛన్‌లు అందజేయాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీకి చెందిన వ్యక్తుల ప్రోద్బలంతో అనర్హులకు కూడా పింఛన్ వస్తున్నా అధికారులు పట్టించుకోకుండా ఉండటం మంచిది కాదన్నారు.

నిజామాబాద్ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు సిద్ధార్ధ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పింఛన్ గురించి వైఎస్సార్సీపీ నాయకులు డిప్యూటీ తహశీల్దార్‌కు వినతి పత్రం సమర్పించారు. వెంటనే అర్హులకు పింఛన్లు ఇప్పించాలని, లేకపోతే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని సిద్ధార్ధ రెడ్డి చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement