ఏసీబీ వలలో అందుగులపేట వీఆర్‌ఓ | acb rides in adilabad district | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో అందుగులపేట వీఆర్‌ఓ

Apr 12 2016 12:10 PM | Updated on Aug 17 2018 12:56 PM

ఆదిలాబాద్ జిల్లా మందమర్రి మండలం అందుగులపేట వీఆర్‌ఓ భూక్యా చందూలాల్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.

మంచిర్యాల టౌన్ : ఆదిలాబాద్ జిల్లా మందమర్రి మండలం అందుగులపేట వీఆర్‌ఓ భూక్యా చందూలాల్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. పట్టాదారు పాసుపుస్తకం జారీ చేసేందుకు చండ్ర నాగేశ్వరరావు అనే రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి వద్ద రూ.7 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇదే సమయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించగా..రూ. 8 లక్షల నగదు, మరో రూ.10 లక్షలు బ్యాంక్‌లో ఉన్నట్లుగా గుర్తించారు. మరో చోట భూములు, మామిడి తోట కొన్నట్లు గుర్తించి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఆదిలాబాద్ ఏసీబీ డీఎస్పీ పాపాలాల్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement