15 ఆటోల సీజ్‌ | 15 Autos seized | Sakshi
Sakshi News home page

15 ఆటోల సీజ్‌

Mar 29 2018 9:35 AM | Updated on Mar 9 2019 4:28 PM

15 Autos seized - Sakshi

ఆటోలను సీజ్‌ చేస్తున్న ఏఎంవీఐ మధు

అల్గునూర్‌(మానకొండూర్‌): పరిమితికి మించి ప్రయాణికులతో వెళ్తున్న 15 ఆటోలను కరీంనగర్‌ రవాణా అధికారులు బుధవారం పట్టుకున్నారు. ఇన్‌చార్జి డీటీసీ కొండల్‌రావు ఆదేశాల మేరకు ఎంవీఐ శ్రీనివాస్, ఏఎంవీఐ రజినీదేవి, మధు ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా ఓవర్‌లోడ్‌ వాహనాల నియంత్రణకు తనిఖీలు నిర్వహించారు. తిమ్మాపూర్‌ మండలం అల్గునూర్, కరీంనగర్‌లోని బొమ్మకల్‌ క్రాస్‌ రోడ్డు, కొత్తపల్లిలో నిర్వహించిన తనిఖీల్లో పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తున్న 15 ఆటోలను పట్టుకొని సీజ్‌ చేశారు. ఓవర్‌లోడ్‌లో వెళ్తున్న రెండు ఇసుక లారీలు, మూడు కంకర లారీలను కూడా పట్టుకొని జరిమానా విధించారు.  

Advertisement
 
Advertisement
Advertisement