దక్షిణ ఢిల్లీలో దారుణం యువతిపై సామూహిక అత్యాచారం | woman gangraped by three youngsters in Car | Sakshi
Sakshi News home page

దక్షిణ ఢిల్లీలో దారుణం యువతిపై సామూహిక అత్యాచారం

Oct 23 2013 11:25 PM | Updated on Sep 1 2017 11:54 PM

యువతిపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. ఈ ఘటన దక్షిణ ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఎన్‌క్లేవ్ ప్రాంతంలో మంగళవారం రాత్రి జరిగింది.

న్యూఢిల్లీ: యువతిపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. ఈ ఘటన దక్షిణ ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఎన్‌క్లేవ్ ప్రాంతంలో మంగళవారం రాత్రి జరిగింది. పోలీసులు మీడియాకు బుధవారం వెల్లడించిన వివరాల ప్రకారం... రోహిత్, టింకు, నరేందర్‌లు బాధితురాలని కారులో రమ్మంటూ బలవంతపెట్టారు. తెలిసినవారే కావడంతో ఆమె వారితో వెళ్లింది. కొంతదూరం వెళ్లాక మత్తుమందు కలిపినఓ పానీయాన్ని తాగమంటూ ఒత్తిడి చేశారు. అది తాగిన ఆమె నిద్రలోకి జారుకోవడంతో కారులోనే ఆమెపై అత్యాచారానికి తెగబడ్డారు. ఆ తర్వాత బాధితురాలిని ఆమె ఇంటికి సమీపంలోనే వదిలేసి అక్కడి నుంచి పరారయ్యారు. జరిగిన దారుణాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
 వైద్య పరీక్షల్లో కూడా అత్యాచారం జరిగిందని తేలడంతో నిందితులపై భారత శిక్షాస్మృతి, సెక్షన్ 376 ప్రకారం కేసు నమోదు చేశారు. బాలిక స్థానిక ప్రైవేటు పాఠశాలలో చదువుతోందని, పాఠశాలకు సమీపంలోనే ఉంటున్న ముగ్గురు యువకులు ఆమెతో పరిచయం పెంచుకున్నారని, దానిని అవకాశంగా చేసుకొని ఈ దారుణానికి తెగబడ్డారని పోలీసులు తెలిపారు. రాజధానిలో జరుగుతున్న అత్యాచారాల్లో ఎక్కువగా తెలిసినవారి వల్లే జరుగుతున్నాయని, ఈ విషయంలో మహిళలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, మానసిక నిపుణులు పదే పదే సూచిస్తున్నా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. ప్రజల్లో చైతన్యం వచ్చినప్పుడే ఇలాంటివి ఆగుతాయంటున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement