రణ్‌బీర్‌పై అసూయ కలుగుతోంది | Why is Saqib Saleem jealous of Ranbir Kapoor? | Sakshi
Sakshi News home page

రణ్‌బీర్‌పై అసూయ కలుగుతోంది

May 13 2014 11:51 PM | Updated on Apr 3 2019 6:23 PM

రణ్‌ణబీర్ కపూర్‌ను చూసి అసూయ పడుతోందంటున్నాడు వర్ధమాన నటుడు సాఖిబ్ సలీమ్. ఓ స్టార్‌గా, నటుడిగా బాలీవుడ్‌లో తనదైన ముద్ర వేస్తున్నాడని కొనియాడాడు.

రణ్‌ణబీర్ కపూర్‌ను చూసి అసూయ పడుతోందంటున్నాడు వర్ధమాన నటుడు సాఖిబ్ సలీమ్. ఓ స్టార్‌గా, నటుడిగా బాలీవుడ్‌లో తనదైన ముద్ర వేస్తున్నాడని కొనియాడాడు. 2011లో ముఝ్‌సే ఫ్రెండ్‌షిప్ కరోగే చిత్రంతో తెరంగేట్రం చేసిన సలీమ్.. రణబీర్‌ను ప్రశంసలతో ముంచెత్తాడు. ఏ జవానీ.. హై దివానీ..! వంటి కమర్షియల్ హిట్లతో పాటు బర్ఫీలాంటి ఆఫ్‌బీట్ సినిమాలు చేసిన రణబీర్ నటుడికి, స్టార్‌కి సరైన ఉదాహరణ అన్నాడు. అంతేకాదు తన సమకాలీన నటులు వరుణ్‌ధవన్, అర్జున్ కపూర్, జాతీయ అవార్డు గ్రహీత రాజ్‌కుమార్ రావులను పొగడ్తలతో ముంచెత్తాడు. ‘మై తేరా హీరో’లో వరుణ్ నటన చూసి ఉద్విగ్నుడినై అతనికి ఫోన్ చేసి..‘బ్రదర్... చంపేశావ్’ అని విష్ చేశాడట.
 
  ‘2 స్టేట్స్’లో అర్జున్ కపూర్, ‘షహీద్’లో రాజ్‌కుమార్ రావ్ నటనా అద్భుతమట. అమోల్ గుప్తా దర్శకత్వం వహించిన హవా హవాయి చిత్రంలో పార్థో గుప్త పాత్రకు స్కేటింగ్ కోచ్‌గా నటించాడు సలీమ్. ఈ పాత్ర చేయమని అడిగినప్పుడు ఆందోళన పడలేదా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ... ఒక విషయాన్ని మనం ఏ విధంగా చూస్తున్నామనే దానిపై అది ఆధారపడి ఉంటుందని, పార్థో గుప్త పాత్రతో తానెప్పుడూ పోల్చుకోలేదని, అతని పాత్రలాగే తన క్యారెక్టర్ బాగుందని తెలిపాడు. చిత్రంలో స్కేటర్ కావాలనేదే అతని కల,  తన కల కూడా అని ఈ విషయంలో ఎప్పుడూ ఎలాంటి సందేహం లేదని వెల్లడించాడు.
 
 ముఝ్‌సే ఫ్రెండ్‌షిప్ కరోగే, మేరే డాడ్ కీ మారుతీ చిత్రాల్లో కాలేజ్ స్టూడెంట్ క్యారెక్టర్ చేసిన సలీమ్ బాంబే టాకీస్‌లో హోమో సెక్సువల్ పాత్రను పోషించాడు.  మూస పాత్రలు కోరుకోవడం లేదని, విభిన్న పాత్రలు చేయాలని ఆశపడుతున్నట్టు చెప్పాడు. సినిమాలో కథను, విషయాన్ని నమ్ముతానని, తాను ఎలాంటి చిత్రాలు చూడటానికి ఇష్టపడతానో, అలాంటి సినిమాల్లోనే నటించాలని కోరుకుంటానని చెబుతున్నాడు. తన తాజా చిత్రానికి సినీ విమర్శకులు, ప్రేక్షకులు, బాలీవుడ్ నుంచి ప్రశంసలు రావడం సంతోషంగా ఉందన్నాడు. క్వీన్ చిత్రంలో కంగనా రనౌత్ నటనను కొనియాడిన సలీమ్.. గత ఐదేళ్లలో ఇంతకంటే మంచి సినిమా తాను చూడలేదని,  అందులో తనకు ఒక్క పొరపాటూ కనిపించలేదని తెలిపాడు. తన సమకాలీన నటుల పాత్రల్లో ఏదైనా చేయాల్సి వస్తే... తాను క్వీన్‌లో కంగనా లాంటి పాత్రనే కోరుకుంటానని చెబుతున్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement