బావిలో పూడిక తీస్తూ ముగ్గురు మృతి | two killed in well | Sakshi
Sakshi News home page

బావిలో పూడిక తీస్తూ ముగ్గురు మృతి

Apr 20 2016 8:36 AM | Updated on Aug 25 2018 5:41 PM

బావిలో పూడిక తీస్తూ  ముగ్గురు మృతి - Sakshi

బావిలో పూడిక తీస్తూ ముగ్గురు మృతి

సిరుగుప్ప తాలూకాలోని నాడంగ గ్రామంలో తాగునీటి కోసం బావిలోని పూడికను తీయడానికి దిగిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందిన ఘటన సిరుగుప్ప పోలీస్టేషన్ పరిధిలో జరిగింది.

సిరుగుప్ప : సిరుగుప్ప తాలూకాలోని  నాడంగ గ్రామంలో తాగునీటి కోసం బావిలోని పూడికను తీయడానికి దిగిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందిన ఘటన సిరుగుప్ప  పోలీస్టేషన్ పరిధిలో జరిగింది. నాడంగ గ్రామంలోని బారిక రామణ్ణ కుమారులైన  నాగరాజు(35), తిమ్మప్ప(32), బి.ఈరన్న కుమారుడు బి.బసవరాజు కూలీ పనుల నిమిత్తం  బావిలోని పూడికను తీసేందుకు బావిలోకి దిగారు.

సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో ఊపిరాడక మృతి చెందినట్లు గ్రామస్తులు గుర్తించారు.   సంఘటన స్థలానికి సిరుగుప్ప పోలీసులు చేరుకొని శవాలను పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మంగళవారం ఉదయం 9 గంటలకు పోస్టుమార్టం  నిర్వహించారు. మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement