రోడ్డు ప్రమాదం: ముగ్గురు వైద్యుల దుర్మరణం | Three doctors killed in road accident in tamilnadu | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదం: ముగ్గురు వైద్యుల దుర్మరణం

Jun 16 2015 8:46 AM | Updated on Aug 30 2018 3:56 PM

తమిళనాడులో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మేల్మరువత్తూర్ సమీపంలో కారు డివైడర్ను ఢీ కొట్టింది.

చెన్నై: తమిళనాడులో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మేల్మరువత్తూర్ సమీపంలో కారు డివైడర్ను ఢీ కొట్టింది.ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వైద్యులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు వైద్యులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని గాయపడిన ముగ్గురు వైద్యులును సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. అయితే మృతుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన డాక్టర్ చంద్రశేఖర్ కూడా ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement