పరమేశ్వర్‌తో విభేదాల్లేవ్ | There are no conflicts with Parameswar | Sakshi
Sakshi News home page

పరమేశ్వర్‌తో విభేదాల్లేవ్

Nov 28 2014 2:16 AM | Updated on Oct 17 2018 6:27 PM

పరమేశ్వర్‌తో విభేదాల్లేవ్ - Sakshi

పరమేశ్వర్‌తో విభేదాల్లేవ్

కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్‌తో తనకు ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు.

కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్‌తో తనకు ఎలాంటి  భిన్నాభిప్రాయాలు లేవని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. నామినేటెడ్ పోస్టుల నియామకాల్లోనూ ఎలాంటి గందరగోళం లేదని వివరించారు.
 
తుమకూరు :  కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్‌తో తనకు ఎలాంటి  భిన్నాభిప్రాయాలు లేవని, కొందరు అనవసరంగా గందరగోళం ృసష్టిస్తున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. గురువారం మధుగిరి తాలూకా మిడిగేశిలో సుమారు రూ.560 కోట్లుతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం మాట్లాడారు. నామినేటెడ్ పోస్టుల నియామకంలో ఎలాంటి గందరగోళం లేదన్నారు.

అక్రమ గనుల తవ్వకాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని   విశ్రాంత లోకాయుక్త సంతోష్‌హెగ్డే చేసిన వ్యాఖ్యలు సత్యదూరమన్నారు. ఇప్పటికే కొన్ని కేసులను సీబీఐ విచారణ చేస్తోందన్నారు. కార్యక్రమంలో మంత్రులు హెచ్‌సీ మహదేవప్ప, టీబీ జయచంద్ర, ఎమ్మెల్యేలు కేఎన్ రాజణ్ణ, రఫీక్ అహ్మద్, జెడీప అధ్యక్షుడు వైఎచ్ హుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement