బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం | rtc bus hulchul in mahabubnagar bus stand | Sakshi
Sakshi News home page

బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం

Mar 17 2017 11:50 AM | Updated on Oct 8 2018 5:07 PM

జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌లో ఆర్టీసీబస్సు బీభత్సం సృష్టించింది.

మహబూబ్‌నగర్‌: జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌లో ఆర్టీసీబస్సు బీభత్సం సృష్టించింది. ప్లాట్‌ఫాం వద్ద ఆగాల్సిన బస్సు అదుపుతప్పి పాదచారులపైకి దూసుకెళ్లడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన ఆర్టీసీ సిబ్బంది క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బ్రేక్‌ ఫెయిల్‌ కావడం వల్లే ప్రమాదం జరిగిందని ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement