సాక్షి,మహబూబ్‌నగర్: దేవరకద్రలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బలమైన ఈదురుగాలులు, వడగండ్ల వాన బీభత్సం సృష్టించాయి. నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి పక్కన కారును పార్క్ చేయగా, రెండు అంతస్తుల ఎత్తులో ఉన్న గోడ భారీ గాలులకు కూలిపోయి కారుపై పడింది.
ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమవగా, అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులు చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టి తీవ్రంగా శ్రమించి వారిని బయటకు తీశారు.
అనంతరం తీవ్ర గాయాలపాలైన వారిని అంబులెన్స్‌లో జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలోనే ఇద్దరూ మృతి చెందారు. ఈ ఘటనతో దేవరకద్రలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతులను సివిల్ ఇంజనీర్ జగన్నాథ్ రెడ్డి, డ్రైవర్ సంతోష్‌గా గుర్తించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది.


