పీఎస్లో చోరీ ... కానిస్టేబులే దొంగ | Police Conistable robbery in police station in tamilnadu | Sakshi
Sakshi News home page

పీఎస్లో చోరీ ... కానిస్టేబులే దొంగ

Dec 29 2015 3:53 PM | Updated on Sep 17 2018 6:26 PM

పీఎస్లో చోరీ ... కానిస్టేబులే దొంగ - Sakshi

పీఎస్లో చోరీ ... కానిస్టేబులే దొంగ

తాను పనిచేస్తున్న పోలీస్‌స్టేషన్లో కానిస్టేబుల్ చోరీకి పాల్పడిన చిత్రమైన సంఘటన తిరుపూరులో జరిగింది.

చెన్నై : తాను పనిచేస్తున్న పోలీస్‌స్టేషన్లో కానిస్టేబుల్ చోరీకి పాల్పడిన చిత్రమైన సంఘటన తిరుపూరులో జరిగింది.  తిరుపూరు నల్లూరు రూరల్ పోలీస్‌స్టేషన్‌లోని సిబ్బంది హాజరీ రిజిస్టరు పుస్తకం గత నెల చోరీకి గురైంది. చోరీ కేసును పరిశీలిస్తున్న పోలీసులు స్టేషన్‌లోని సీసీ టీవీ కెమెరా ఫుటేజీని పరిశీలించి నోళ్లు వెళ్లబెట్టారు. గత నెల 28వ తేదీ తెల్లవారుజాము 5.45 గంటలకు అదే పోలీస్ స్టేషన్‌లో పనిచేసే పళనిస్వామి అనే కానిస్టేబుల్ స్టేషన్లోకి జొరబడి రిజిస్టరునుఎత్తుకె ళ్లడం అందులో రికార్డు అయి ఉంది.
 
అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు కావడంతో అధికారులు రిజిస్టరులో అతనికి అబ్సెంట్ మార్క్ వేశారు. ఈ అబ్సెంట్‌ను కప్పిపుచ్చుకునేందుకే రిజిస్టరును దొంగిలించినట్లు తేలింది. పళనిస్వామి ఇంటి నుంచి సోమవారం నాడు రిజిస్టరును స్వాధీనం చేసుకున్నారు. గతంలో పనిచేసిన పోలీస్‌స్టేషన్లలో సైతం ఇన్‌స్పెక్టర్ తుపాకీని, మహిళా కానిస్టేబుల్ సెల్‌ఫోన్‌ను దొంగిలించిన నేర చరిత్ర ఉంది. సదరు కానిస్టేబుల్‌పై శాఖాపరమైన విచారణకు ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement