కడెంలో 24 ద్విచక్రవాహనాలు సీజ్‌ | police carden search in nirmal district | Sakshi
Sakshi News home page

కడెంలో 24 ద్విచక్రవాహనాలు సీజ్‌

May 5 2017 11:40 AM | Updated on Aug 21 2018 5:51 PM

నిర్మల్‌ జిల్లా కడెం మండల కేంద్రంలో పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు.

కడెం: నిర్మల్‌ జిల్లా కడెం మండల కేంద్రంలో పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 24 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు, అక్రమంగా నిల్వ ఉంచిన రూ.20 వేల విలువ గల గుట్కా, మద్యం ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే నల్లబెల్లం, దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అజార్, రమేష్ అనే ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కడెం, దస్తురాబాద్, ఖానాపూర్, పెంబి ఎస్ఐల ఆధ్వర్యంలో వందమంది పోలీసులతో కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించినట్లు ఖానాపూర్‌ సీఐ నరేష్‌కుమార్‌ వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement