'ప్రచారం కోసమే కేసులోకి లాగారు' | i'm not connected to nayeem illegal activities, says r. krishnaiah | Sakshi
Sakshi News home page

'ప్రచారం కోసమే కేసులోకి లాగారు'

Nov 2 2016 2:20 PM | Updated on Nov 6 2018 4:42 PM

'ప్రచారం కోసమే కేసులోకి లాగారు' - Sakshi

'ప్రచారం కోసమే కేసులోకి లాగారు'

నయీం నేర కార్యకలాపాలతో తనకు ఎటువంటి సంబంధం లేదని ఆర్.కృష్ణయ్య అన్నారు.

హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం నేర కార్యకలాపాలతో తనకు ఎటువంటి సంబంధం లేదని ఎల్బీనగర్ టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య అన్నారు. ప్రభుత్వం ప్రచారం కోసమే తనను ఈ కేసులోకి లాగిందన్నారు. నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఆయన విచారణ హాజరయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... పత్రికల్లో తాను మాట్లాడిన అంశాలపైనే తనను పోలీసులు పశ్నించినట్టు చెప్పారు.

తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని, మౌఖికంగా రమ్మంటే వచ్చానని వెల్లడించారు. నయీం తన శిష్యుడని చేసిన వ్యాఖ్యల గురించి అడిగారని తెలిపారు. తాను ప్రజాసమస్యలపైనే పోరాడుడుతున్నానని, రోజూ వందలాది మంది కలుస్తుంటానని చెప్పారు. తనపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే ప్రశ్నించవచ్చని అన్నారు. తదుపరి విచారణకు రావాల్సిందిగా తనకేమీ చెప్పలేదని కృష్ణయ్య తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement