పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల పట్టణంలోని దేవాలయానికి వెళ్లే ఘాట్‌రోడ్డు సమీపంలో ప్రమాదం జరిగింది.
ద్వారకా తిరుమలలో రోడ్డు ప్రమాదం
Aug 26 2016 11:41 AM | Updated on Aug 30 2018 4:07 PM
-ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు
ద్వారకాతిరుమల: పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల పట్టణంలోని దేవాలయానికి వెళ్లే ఘాట్‌రోడ్డు సమీపంలో ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న నలుగురిని ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కామవరపుకోట మండలం కొత్తూరు గ్రామానికి చెందిన రిషి అనే 18 నెలల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా.. నల్లమిల్లి విజయ్, శ్రావణి అనే దంపతులకు తీవ్రగాయాలయ్యాయి. శ్రావణి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. వీరంతా స్వగ్రామం కొత్తూరు నుంచి ఘాట్ రోడ్డు మీదుగా అక్కుపల్లి గోకవరం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం ఏలూరుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement


