ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ | west indies won the toss and elected to field first | Sakshi
Sakshi News home page

ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్

Mar 20 2016 7:20 PM | Updated on Nov 9 2018 6:43 PM

వరల్డ్ టీ 20లో భాగంగా ఆదివారం చిన్నస్వామి స్టేడియంలో శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్లో వెస్టిండీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

బెంగళూరు:వరల్డ్ టీ 20లో భాగంగా ఆదివారం చిన్నస్వామి స్టేడియంలో శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్లో వెస్టిండీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. గ్రూప్-1 లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి మంచి ఊపు మీద ఉన్నాయి. అఫ్ఘానిస్తాన్ పై శ్రీలంక గెలవగా, ఇంగ్లండ్ పై వెస్టిండీస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

 

అయితే ప్రస్తుత పరిస్థితుల్లో డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంక కంటే విండీస్ కాస్త మెరుగ్గా కనబడుతోంది. మరోవైపు శ్రీలంక ప్రధాన బౌలర్ మలింగా ప్రపంచకప్కు దూరం కావడంతో ఆ జట్టు బౌలింగ్ బలహీనపడిందనే చెప్పాలి. అయితే ఇరు జట్లలో హిట్టర్లు ఉన్నందున పోరు ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement