వెస్టిండీస్‌దే టి20 సిరీస్‌

West indies Won The T20 Series Against Sri Lanka - Sakshi

పల్లెకెలె (శ్రీలంక): శ్రీలంకతో జరిగిన రెండో టి20లో వెస్టిండీస్‌ 7 వికెట్లతో నెగ్గింది. దాంతో రెండు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను 2–0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. వన్డేల్లో 0–3తో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకుంది. శుక్రవారం ఈ మ్యాచ్‌లో తొలుత శ్రీలంక 20 ఓవర్లలో 6 వికెట్లకు 155 పరుగులు చేసింది. దసున్‌ శనక (24 బంతుల్లో 31; 3 ఫోర్లు, సిక్స్‌) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కరీబియన్‌ జట్టు 17 ఓవరల్లో మూడు వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసి గెలుపొందింది. బ్రాండన్‌ కింగ్‌ (21 బంతుల్లో 43; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), హెట్‌మైర్‌ (42 బంతుల్లో 43 నాటౌట్‌; 3 ఫోర్లు), రసెల్‌ (14 బంతుల్లో 40 నాటౌట్‌; 6 సిక్స్‌లు) రాణించారు. ముఖ్యంగా రసెల్‌ సిక్స్‌లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. రసెల్‌ మెరుపు ఇన్నింగ్స్‌ కారణంగా విండీస్‌ మరో మూడు ఓవర్లు మిగిలి ఉండగానే గెలుపొందింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top