ఉదయం ప్రియురాలితో.. రాత్రి టీమిండియాతో! | TeamIndia captain Virat Kohli celebrated his birthday with his Teammates | Sakshi
Sakshi News home page

ఉదయం ప్రియురాలితో.. రాత్రి టీమిండియాతో!

Nov 6 2016 8:45 AM | Updated on Sep 18 2018 8:48 PM

ఉదయం ప్రియురాలితో.. రాత్రి టీమిండియాతో! - Sakshi

ఉదయం ప్రియురాలితో.. రాత్రి టీమిండియాతో!

టీమిండియా స్టార్ ఆటగాడు, టెస్ట్ ఫార్మాట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ శనివారం పుట్టినరోజు వేడుకను ఘనంగా జరుపుకున్నాడు.

టీమిండియా స్టార్ ఆటగాడు, టెస్ట్ ఫార్మాట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ శనివారం పుట్టినరోజు వేడుకను ఘనంగా జరుపుకున్నాడు. శనివారం విరాట్ సరిగ్గా 28 వసంతాలు పూర్తిచేసుకుని 29వ వసంతంలోకి ప్రవేశించాడు. అయితే ఆ రోజు కోహ్లీ ముందుగా తన ప్రియురాలు అనుష్కతో కలిసి జాలీగా బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నాడు. గత కొన్నాళ్ల నుంచి దూరంగా ఉంటున్నారన్న వదంతులకు కోహ్లీ, అనుష్క జంట మరోసారి చెక్ పెట్టింది. శనివారం సాయంత్రం టీమిండియా సమయక్షంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకను మొదలుపెట్టాడు. టీమిండియా అధికారిక ఫేస్ బుక్ లో నిన్న రాత్రి పోస్ట్ చేసిన కోహ్లీ పుట్టినరోజు వేడుకల వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కేవలం 11 గంటల వ్యవధిలోనే దాదాపు 30 లక్షల మంది ఆ వీడియోను వీక్షించారు.

భారత క్రికెటర్ల మధ్య విరాట్ శనివారం రాత్రి కేక్ కట్ చేశాడు. కోచ్ అనిల్ కుంబ్లే, కోహ్లకి మొదట బర్త్ డ్ విషెస్ చెప్పి కేక్ తినిపించాడు. కోహ్లీ మాత్రం డాన్స్ చేస్తూ హుషారుగా కేక్ కట్ చేస్తుండగా అసలు రచ్చ మొదలైంది. ఉమేశ్ యాదవ్ కోహ్లీకి కేక్ రాయడం స్టార్ట్ చేయగా, ఆ వెంటనే అశ్విన్, అజింక్యా రహానే, హార్దిక్ పాండ్యా సహా జట్టు ఆటగాళ్లు బర్త్ డే బాయ్ కోహ్లీని కేక్ తో ఓ ఆట ఆడుకున్నారు. కోహ్లీ ముఖం, తల భాగం మొత్తం కేక్ తో రుద్ది చిన్న పిల్లల తరహాలో పుట్టినరోజును ఎంజాయ్ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement