లంకదే టి20 సిరీస్ | sri lanka won T20 series | Sakshi
Sakshi News home page

లంకదే టి20 సిరీస్

Jan 29 2014 1:09 AM | Updated on Sep 19 2019 2:50 PM

లంకదే టి20 సిరీస్ - Sakshi

లంకదే టి20 సిరీస్

వన్డే సిరీస్‌లో చెలరేగిన భారత బ్యాట్స్‌వుమన్ పొట్టి ఫార్మాట్‌లో మాత్రం చేతులెత్తేశారు. శ్రీలంక మహిళల జట్టు అన్ని విభాగాల్లో మెరుగ్గా రాణించి..

విశాఖపట్నం, సాక్షి: వన్డే సిరీస్‌లో చెలరేగిన భారత బ్యాట్స్‌వుమన్ పొట్టి ఫార్మాట్‌లో మాత్రం చేతులెత్తేశారు. శ్రీలంక మహిళల జట్టు అన్ని విభాగాల్లో మెరుగ్గా రాణించి.. మంగళవారం జరిగిన మూడో టి20లో భారత జట్టును ఆరు వికెట్లతో ఓడించింది. దీంతో సిరీస్  2-1తో శ్రీలంక వశమైంది. కెప్టెన్ శశికళ సిరివర్ధనే (42 బంతుల్లో 46 నాటౌట్; 4 ఫోర్లు; 1 సిక్స్) తమ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది.
 
  వైఎస్సార్ - ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో... టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 117 పరుగులు చేసింది. కెప్టెన్ మిథాలీ రాజ్ గాయం కారణంగా బరిలోకి దిగకపోవడంతో... హర్మన్‌ప్రీత్ కౌర్ జట్టుకు నాయకత్వం వహించింది. పూనమ్ రౌత్ (45 బంతుల్లో 38; 3 ఫోర్లు), జులన్ గోస్వామి (26 బంతుల్లో 37 నాటౌట్; 1 ఫోర్; 3 సిక్స్) మాత్రమే రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన లంక 18.5 ఓవర్లలో నాలుగు వికెట్లకు 121 పరుగులు చేసి నెగ్గింది.
 

Advertisement
 
Advertisement
Advertisement