ఐటీఎఫ్‌ టోర్నీకి సౌమ్య | Sowmya To ITF Tourney | Sakshi
Sakshi News home page

ఐటీఎఫ్‌ టోర్నీకి సౌమ్య

Mar 8 2020 10:06 AM | Updated on Mar 8 2020 10:06 AM

Sowmya To ITF Tourney - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ అమ్మాయి ఆర్‌. సౌమ్యకు అరుదైన అవకాశం దక్కింది. ఆస్ట్రేలియా వేదికగా జరిగే అంతర్జాతీయ జూనియర్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌ (ఐటీఎఫ్‌)లో పాల్గొనే ముగ్గురు సభ్యులతో కూడిన భారత జట్టులో ఆమె స్థానం దక్కించుకుంది. అండర్‌–14 విభాగంలో పాల్గొనే భారత్‌ జట్టులో నుంచి హరియాణా ప్లేయర్‌ శ్రుతి అహ్లావత్‌ అనారోగ్యంతో వైదొలగడంతో... సౌమ్యకు పిలుపొచ్చింది. ప్రస్తుతం భారత నంబర్‌–4 ర్యాంకర్‌గా ఉన్న సౌమ్య ఆసియాలో 30వ ర్యాంకులో ఉంది. ప్రస్తుతం సౌమ్య   ఆసిఫ్‌ టెన్నిస్‌ క్లబ్‌లో కోచ్‌ నార్లీకర్‌ పర్యవేక్షణలో శిక్షణ పొందుతుంది. 

Advertisement
 
Advertisement
Advertisement