ఆసీస్ కెప్టెన్ స్టీవెన్ స్మిత్ హాఫ్ సెంచరీ(198/3) | smith gets half century | Sakshi
Sakshi News home page

ఆసీస్ కెప్టెన్ స్టీవెన్ స్మిత్ హాఫ్ సెంచరీ(198/3)

Dec 18 2014 12:04 PM | Updated on Sep 2 2017 6:23 PM

టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో ఆసీస్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన స్టీవెన్ స్మిత్ మరోసారి ఆకట్టుకున్నాడు.

బ్రిస్బేన్:టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో ఆసీస్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన స్టీవెన్ స్మిత్ మరోసారి ఆకట్టుకున్నాడు. స్మిత్ 5 ఫోర్లు, 2  సిక్సుల సాయంతో హాఫ్ సెంచరీ మార్కును చేరుకున్నాడు. తొలి టెస్టులో సెంచరీతో ఆకట్టుకున్స స్మిత్ .. భారత్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. అతనికి సాయంగా షాన్ మార్ష(32)పరుగులతో క్రీజ్ ఉన్నాడు.

అంతకుముందు డేవిడ్ వార్నర్ (29),  షేన్ వాట్సన్ (25), రోజర్స్ (55)  పరుగులు చేసి పెవిలియన్ కు చేరారు. వరుసుగా రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్లు కనిపించినా.. స్మిత్ బ్యాటింగ్ తిరిగి ఆసీస్ తేరుకుంది.భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్ కు రెండు వికెట్లు లభించగా, అశ్విన్ కు ఒక వికెట్టు లభించింది.

Advertisement
 
Advertisement
Advertisement