అక్తర్ వయసు 39.. అమ్మాయి వయసు 17 | Shoaib Akhtar is set to tie the knot with a teenage girl | Sakshi
Sakshi News home page

అక్తర్ వయసు 39.. అమ్మాయి వయసు 17

Jun 7 2014 3:50 PM | Updated on Apr 8 2019 6:21 PM

అక్తర్ వయసు 39.. అమ్మాయి వయసు 17 - Sakshi

అక్తర్ వయసు 39.. అమ్మాయి వయసు 17

అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరయిన 39 ఏళ్ల షోయబ్ ఓ టీనేజ్ బాలికను వివాహం చేసుకోబోతున్నట్టు పాకిస్థాన్ మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి.

కరాచీ: ప్రపంచంలోనే వేగవంతమైన ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా.. అభిమానులు రావల్పిండి ఎక్స్ప్రెస్గా పిలుచుకునే పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ లేటు వయసులో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరయిన 39 ఏళ్ల షోయబ్ ఓ టీనేజ్ బాలికను వివాహం చేసుకోబోతున్నట్టు పాకిస్థాన్ మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి. అతని కంటే ఆ అమ్మాయి వయసులో 21 ఏళ్లు చిన్నది.

హరిపూర్ జిల్లాకు చెందిన వ్యాపారవేత్త ముస్తక్ ఖాన్ కుమార్తె 17 ఏళ్ల రుబబ్తో షోయబ్ పెళ్లి నిశ్చయమైంది. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో ఈ నెల మూడో వారంలో వివాహం జరగనుంది. గతేడాది ఇరు కుటుంబాలు తొలిసారి కలసినట్టు సమాచారం. 19, 20, 22 తేదీల్లో వివాహ కార్యక్రమాలు జరగనున్నట్టు పాకిస్థాన్ పత్రిక వెల్లడించింది. కాగా రుబబ్కు క్రికెట్ అంటే పెద్దగా ఆసక్తి లేదట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement