అచ్చం యువరాజ్‌లానే..

Shivam Dube Next Yuvraj Singh Fans React To BCCI - Sakshi

ఢిల్లీ: భారత్‌ క్రికెట్‌లో యువరాజ్‌ సింగ్‌ది ప్రత్యేక శైలి. ఎడమచేతి వాటం ఆటగాడైన యువరాజ్‌ ఒక స్ట్రోక్‌ ప్లేయర్‌. సుదీర్ఘకాలం భారత్‌ క్రికెట్‌కు సేవలందించడమే కాకుండా తనదైన ముద్రవేశాడు యువరాజ్‌. కొన్ని నెలల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పిన యువరాజ్‌ సింగ్‌.. ఇప్పుడు విదేశీ లీగ్‌లు ఆడుకుంటున్నాడు. కాగా, ఇప్పుడు భారత్‌ జట్టుకు మరో యువరాజ్‌ దొరికినట్లే కనబడుతోంది.  శివం దూబే రూపంలో యువరాజ్‌ మళ్లీ ఫీల్డింగ్‌ అడుగుపెట్టబోతున్నాడా అనేంతంగా అతని స్ట్రోక్‌ ప్లే ఉంది.( ఇక్కడ చదవండిఐదేళ్లు క్రికెట్‌కు గ్యాప్‌ ఇచ్చాడు.. కానీ)

దేశవాళీ క్రికెట్‌లో ఇటీవల భారీ సిక్సర్లు కొడుతూ వెలుగులోకి వచ్చిన ఈ 26 ఏళ్ల ముంబై ఆల్‌రౌండర్‌.. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లో చోటు దక్కించుకున్నాడు. దీనిలో భాగంగా నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేసిన దూబే ఆడిన షాట్లు ఆకట్టుకుంటున్నాయి. ఈ మేరకు బీసీసీఐ ఒక వీడియోను పోస్ట్‌ చేయగా, ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. అచ్చం యువరాజ్‌లానే బ్యాటింగ్‌ చేస్తున్నాడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మనకు దొరికిన తదుపరి యువరాజ్‌ అంటూ కొనియాడుతున్నారు. తన ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో రెండు సెంచరీలు, ఏడు హాఫ్‌ సెంచరీల సాయంతో 48.19 సగటుతో 1,012 పరుగులు చేసిన దూబే.. జాతీయ జట్టు తరఫున కూడా రాణించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. దూబే ప్రాక్టీస్‌కు సంబంధించి బీసీసీఐ పోస్ట్‌ చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఈ రోజు రాత్రి 7.00లకు భారత్‌-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య తొలి టీ20 జరుగనుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top