'కరోనా వెళ్లిపోయాకా ఇద్దరం కలిసి హార్స్‌ రైడ్‌ చేద్దాం'

Shikhar Dhawan Replies To Ravindra Jadeja Through Instagram - Sakshi

కరోనా వైరస్‌ బారీన పడి ప్రపంచం అతలాకుతలమవుతున్న సంగతి తెలిసిందే. ఆ తాకిడి క్రీడలపై కూడా పడిందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాగా ఎప్పుడు బిజీ షెడ్యూల్‌తో తీరిక తేకుండా గడిపే టీమిండియా ఆటగాళ్లు కరోనా పుణ్యమాని తమకు నచ్చిన పని చేసుకుంటూ ఆనందంగా గడిపేస్తున్నారు. ప్రస్తుతం టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా కూడా తనకు ఎంతో ఇష్టమైన హార్స్‌ రైడింగ్‌తో రోజులను ఎంజాయ్‌ చేస్తున్నాడు. జడేజాకు హార్స్‌ రైడింగ్‌ అంటే ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తీరిక సమయాలలో హార్స్‌ రైడింగ్‌లో తన నైపుణ్యతను ప్రదర్శించి ఆ వీడియోనూ ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తుంటాడు.  తాజాగా జడ్డూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో గుర్రాలతో గడిపిన మూమెంట్స్‌ను షేర్‌ చేసుకున్నాడు.' నా గురించి తెలుసుకోవటానికి నా గుర్రాలు ఎంతగానో సహయపడుతున్నాయి' అంటూ కాప్షన్‌ జత చేశాడు. అయితే జడ్డూ పెట్టిన పోస్ట్‌కు భారత ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌ స్పందించాడు. ' జడ్డూ బాయ్‌... దేశం కరోనా వైరస్‌ నుంచి బయటపడ్డాక మనిద్దరం కలిసి జాలీగా హార్స్‌ రైడింగ్‌ చేద్దామంటూ' ఫన్నీ పోస్టు షేర్‌ చేశాడు.  

కాగా ప్రపంచవ్యాప్తంగా గడగడలాడిస్తోన్న కరోనా వైరస్‌ భారత్‌లో కూడా విజృంబిస్తోంది. ఇప్పటివరకు 4వేలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా, మృతుల సంఖ్య 110 దాటేసింది. ఈ నేపథ్యంలో మార్చి 22 నుంచి కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ నియమించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్‌ 14తో లాక్‌డౌన్‌ ముగుస్తుందా లేదా అనేది సందేహంగానే మిగిలింది. కాగా మార్చి 31నుంచి జరగాల్సిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2020 కరోనా ఎఫెక్ట్‌తో వాయిదా పడింది.

(లాక్‌డౌన్‌: వీరంతా ఏం చేస్తున్నారో చూశారా?)

(‘అతడి ముచ్చటంటే కోహ్లికి ఇష్టమంటా’)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top