‘అతడి ముచ్చటంటే కోహ్లికి ఇష్టమంటా’

Virat Kohli Reveals Nasser Hussain Is His Favourite Commentator - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కరోనో వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో విధించిన లాక్‌డౌన్‌ను టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నాడు. లాక్‌డౌన్‌ కంటే ముందే తన సతీమణి, బాలీవుడ్‌ బ్యూటీ అనుష్క శర్మతో తన ప్రత్యేక ఫామ్‌హౌజ్‌కు వెళ్లిపోయాడు. దీంతో ఈ ప్రేమ‌ప‌క్షులు ఇప్ప‌డు ఇంట్లోనే ఆనందంగా  గ‌డుపుతున్నారు. వీలుచిక్కినప్పుడల్లా సోషల్‌ మీడియాలో అభిమానులతో టచ్‌లోకి వస్తున్నారు. ఇక ఈ లాక్‌డౌన్‌ సమయంలో ఇంగ్లండ్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మాజీ ఆటగాడు కెవిన్‌ పీటర్సన్‌తో కోహ్లికి మరింత బాండింగ్‌ ఏర్పడింది. తరుచూ ఇన్‌స్టాగ్రామ్‌ వీడియో కాలింగ్‌లో సరదాగా సంభాషించుకుంటున్నారు. 

తాజాగా వీరిద్దరు ముచ్చటించుకుంటూ.. ఇష్టమైన క్రికెట్‌ కామెంటేటర్‌(వ్యాఖ్యాత) ఎవరని టీమిండియా సారథిని కేపీ ఆడిగాడు. అయితే సమాధానం ఇవ్వడానికి కోహ్లి చాలా సమయమే తీసుకున్నాడు. ఇదే క్రమంలో దీనికి ఆన్సర్‌ చాలా జాగ్రత్తగా ఇవ్వమని లేకుంటే ఇబ్బందుల్లో పడతావని హెచ్చరించాడు. ఈ గ్యాప్‌లో ఆలోచించిన కోహ్లి తనకు ఇష్టమైన వ్యాఖ్యాత ఇంగ్లండ్‌ మాజీ సారథి నాసిర్‌ హుస్సేన్‌ అని పేర్కొన్నాడు. అతడి వ్యాఖ్యానం ఎందుకో నాకు బాగా నచ్చుతుందని, వివాదాల జోలికి వెళ్లకుండా చాలా సరదాగా మాట్లాడతాడని తెలిపాడు. చాలా తెలివిగా సమాధానం చెప్పావని కేపీ ప్రశంసించాడు. అదేవిధంగా లియన్‌ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డోలలో రొనాల్డో తనకు ఎంతో ఇష్టమని మరో ప్రశ్నకు సమాధానంగా కోహ్లి పేర్కొన్నాడు. 

చదవండి:
డివిలియర్స్‌ను స్లెడ్జింగ్‌ చేయలేదు!
లాక్‌డౌన్‌: ‘ఖైదీననే భావన కలుగుతోంది’

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top