సెమీ ఫైనల్ బెర్తులు ఖరారు | semi final teams confirmed | Sakshi
Sakshi News home page

సెమీ ఫైనల్ బెర్తులు ఖరారు

Sep 30 2014 8:07 PM | Updated on Sep 2 2017 2:11 PM

సెమీ ఫైనల్ బెర్తులు ఖరారు

సెమీ ఫైనల్ బెర్తులు ఖరారు

ఈసారి కూడా చాంపియన్ లీగ్ లో మూడు ఐపీఎల్ టీంలు సెమీ ఫైనల్ కు అర్హత సాధించాయి.

హైదరాబాద్: ఈసారి కూడా చాంపియన్ లీగ్ లో మూడు ఐపీఎల్ టీంలు సెమీ ఫైనల్ కు అర్హత సాధించాయి. గ్రూప్ ఏ నుంచి కోల్ కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ సెమీ ఫైనల్ కు దూసుకెళ్లగా, గ్రూప్ బి నుంచి పంజాబ్ కింగ్స్ ఎలెవన్ సెమీ ఫైనల్ కు చేరింది. వీటితో పాటు విదేశీ జట్టు హోబార్ట్ హరికేన్ సెమీ ఫైనల్ బెర్తును ఖాయం చేసుకుంది.  అక్టోబర్ 2 వ తేదీన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ లో కోల్ కతా తో హోబార్ట్ హరికేన్స్ తలపడనుంది. అనంతరం అదే రోజు సాయంత్రం రెండో సెమీ ఫైనల్ పోరులో చెన్నై సూపర్ కింగ్స్ ను పంజాబ్ జట్టు ఢీకొంటుంది. ఈరెండు సెమీ ఫైనల్ మ్యాచ్ లు కూడా హైదరాబాద్ లో జరుగుతుండటం గమనార్హం.

 

లీగ్ దశలో పంజాబ్, కోల్ కతా లు ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా సెమీ ఫైనల్ కు చేరగా, చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం ఒక్క మ్యాచ్ లో ఓటమి చవిచూసింది. గత ఛాంపియన్ లీగ్ లో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ లు సెమీస్ కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement