పదింతల ట్యాక్స్ వసూలు చేసినట్లుంది: సెహ్వాగ్ | sehwag praises on Kedar Jadhav | Sakshi
Sakshi News home page

పదింతల ట్యాక్స్ వసూలు చేసినట్లుంది: సెహ్వాగ్

Jan 16 2017 1:22 PM | Updated on Sep 5 2017 1:21 AM

పదింతల ట్యాక్స్ వసూలు చేసినట్లుంది: సెహ్వాగ్

పదింతల ట్యాక్స్ వసూలు చేసినట్లుంది: సెహ్వాగ్

మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఇంగ్లండ్ తో జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా సంచలన విజయం సాధించడంలో ముఖ్య భూమిక పోషించిన కేదర్ జాదవ్పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది

పుణె:మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఇంగ్లండ్ తో జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా సంచలన విజయం సాధించడంలో ముఖ్య భూమిక పోషించిన కేదర్ జాదవ్పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.ఈ యువ క్రికెటర్పై పలువురు మాజీ క్రికెటర్లు పొగడ్తల వర్షం కురిపించగా, మన ట్విట్టర్ కింగ్ వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం తనదైన శైలిలో ట్వీట్ చేశాడు. కేదర్ జాదవ్ ఆడిన అద్భుత ఇన్నింగ్స్ తో భారత్ గెలవడం ఒకేసారి పదింతల ట్యాక్స్ వసూలు చేసినట్లుందని సెహ్వాగ్ తన ట్విట్టర్ అకౌంట్లో పేర్కొన్నాడు. భారత్ విజయం తరువాత తొలి ట్వీట్ లో జై జాదవ్ అని పేర్కొన్న సెహ్వాగ్.. ఆ తరువాత 'దస్ గుణ లగాన్ వసూల్' అంటూ మరో ట్వీట్ చేశాడు.

ఆదివారం ఇంగ్లండ్ తో జరిగిన తొలి వన్డేలో భారత్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ విసిరిన 351 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లి(122;105 బంతుల్లో8 ఫోర్లు, 5 సిక్సర్లు), జాదవ్(120;76 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లు)లు ప్రధాన పాత్ర పోషించి భారత్ కు గెలుపు అందించారు. ఈ ఏడాదిని భారత క్రికెట్ జట్టు విజయంతో ఆరంభించడంపై సచిన్, హర్భజన్ సింగ్, మహ్మద్ కైఫ్లు ఆనందం వ్యక్తం చేశారు. ఇది భారత జైత్రయాత్రకు తొలి అడుగు అంటూ వారు కొనియాడారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement