చల చల్లగా... సరదా సరదాగా...  | Sehwag, Afridi spice it up on Lake St. Moritz | Sakshi
Sakshi News home page

చల చల్లగా... సరదా సరదాగా... 

Feb 9 2018 3:28 AM | Updated on Mar 28 2019 6:18 PM

Sehwag, Afridi spice it up on Lake St. Moritz - Sakshi

మ్యాచ్‌లో ప్రయర్, సెహ్వాగ్, అక్తర్‌

స్విట్జర్లాండ్‌లోని సెయింట్‌ మోరిట్జ్‌లో ఐస్‌ క్రికెట్‌ సరదాగా సాగింది. గడ్డకట్టిన సరస్సుపై ఏర్పాటు చేసిన మ్యాటింగ్‌ వికెట్‌పై మైనస్‌ 12 డిగ్రీల హిమతాపంలో క్రికెట్‌ దిగ్గజాలు టి20 మెరుపులతో అలరించారు. డాషింగ్‌ ఓపెనర్‌ సెహ్వాగ్‌ (31 బంతుల్లో 62) ఇక్కడ కూడా తన ప్రతాపాన్ని చూపెట్టాడు. అయితే  వీరూ జట్టుపై ఆఫ్రిది జట్టు గెలుపొందడం విశేషం.

మొదట సెహ్వాగ్‌ ప్రాతినిధ్యం వహించిన డైమండ్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 164 పరుగులు చేసింది. ప్రత్యర్థి బౌలర్లలో రజాక్‌ 4 వికెట్లు తీశాడు. తర్వాత ఆఫ్రిది, అక్తర్‌లున్న రాయల్స్‌ 15.2 ఓవర్లలో 4 వికెట్లకు 166 పరుగులు చేసి గెలిచింది. ఓవైస్‌ షా (34 బంతుల్లో 74), కలిస్‌ (26 బంతుల్లో 36) ధాటిగా ఆడారు. శుక్రవారం రెండో టి20 జరుగుతుంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement