గేల్ మళ్లీ వచ్చాడు | Mumbai Indians will bowl first | Sakshi
Sakshi News home page

గేల్ మళ్లీ వచ్చాడు

May 11 2016 7:42 PM | Updated on Sep 3 2017 11:53 PM

గేల్ మళ్లీ వచ్చాడు

గేల్ మళ్లీ వచ్చాడు

ఆర్సీబీ టీమ్ లో ట్రవీస్ హెడ్ స్థానంలో క్రిస్ గేల్ జట్టులోకి వచ్చాడు.

బెంగళూరు: ఐపీఎల్-9లో భాగంగా బుధవారమిక్కడ జరుగుతున్న 41వ లీగ్ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లు పోటీ పడుతున్నాయి. టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. టాస్ ఓడిపోవడం పట్ల ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి అసంతృప్తి వ్యక్తం చేశాడు. బోర్డుపై పరుగులు ఎక్కువ నమోదయ్యేలా చూసుకుంటామని దీమాగా చెప్పాడు.

ఆర్సీబీ టీమ్ లో ట్రవీస్ హెడ్ స్థానంలో క్రిస్ గేల్ జట్టులోకి వచ్చాడు. ఇక్బాల్ అబ్దుల్లా బదులు శ్రీనాథ్ అరవింద్ ను తీసుకున్నారు. ముంబై టీమ్ లో ఒక మార్పు జరిగింది. హార్థిక్ పాండ్యా స్థానంలో నితీష్ రాణాను టీమ్ లోకి వచ్చాడు. నితీశ్ కు ఇదే తొలి ఐపీఎల్ మ్యాచ్. పాయింట్ల పట్టికలో ముంబై 5, బెంగళూరు 6 స్థానాల్లో ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement