లవ్‌ @టెన్నిస్‌ కోర్ట్‌... | Love match: Everyones crazy for Monfils and Svitolina | Sakshi
Sakshi News home page

లవ్‌ @టెన్నిస్‌ కోర్ట్‌...

Jan 21 2019 1:31 AM | Updated on Jan 21 2019 1:31 AM

Love match: Everyones crazy for Monfils and Svitolina - Sakshi

మెల్‌బోర్న్‌: టెన్నిస్‌ జగతిలో కొత్తగా మరో కొత్త ప్రేమకథ మొదలైంది. ఫ్రాన్స్‌కు చెందిన గేల్‌ మోన్‌ఫిల్స్, ఉక్రెయిన్‌ క్రీడాకారిణి ఎలీనా స్వితోలినా తాము ప్రేమలో ఉన్నట్లు ప్రకటించారు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఆరో సీడ్‌ స్వితోలినా మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో ప్లేయర్‌ బాక్స్‌లో కూర్చొని మోన్‌ఫిల్స్‌ ఆమెను ప్రోత్సహించడం కనిపించింది. దీనిపై ప్రశ్నించగా...‘అతను నా కోసమే, నాకు మద్దతునిచ్చేందుకే అక్కడికి వచ్చాడు. నేను కూడా అతని కోసమే ఉన్నాను.

ఇప్పుడు మా మధ్య ఎలాంటి అనుబంధం ఉందో ఇద్దరికీ బాగా తెలుసు’ అంటూ స్వితోలినా తమ బంధాన్ని నిర్ధారించింది. తమ ఇద్దరి పేర్లు ‘గేల్‌ ఎలీనా మోన్‌ఫిల్స్‌ స్వితోలినా’లను కలుపుతూ వీరు ‘జీ.ఈ.ఎం.ఎస్‌ లైఫ్‌’ పేరుతో ఒకే ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ను మొదలు పెట్టడం విశేషం. ఇందులో వారిద్దరు కలిసి ఉన్న వీడియోను కూడా పంచుకున్నారు. 7 ఏటీపీ టైటిల్స్‌ గెలిచిన 32 ఏళ్ల మోన్‌ఫిల్స్‌ ప్రస్తుతం 33వ ర్యాంక్‌లో ఉన్నాడు. 13 డబ్ల్యూటీఏ టైటిల్స్‌ సాధించిన 24 ఏళ్ల స్వితోలినా ప్రస్తుతం 7వ ర్యాంక్‌లో కొనసాగుతోంది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement