breaking news
Svitolina
-
లవ్ @టెన్నిస్ కోర్ట్...
మెల్బోర్న్: టెన్నిస్ జగతిలో కొత్తగా మరో కొత్త ప్రేమకథ మొదలైంది. ఫ్రాన్స్‌కు చెందిన గేల్ మోన్ఫిల్స్, ఉక్రెయిన్ క్రీడాకారిణి ఎలీనా స్వితోలినా తాము ప్రేమలో ఉన్నట్లు ప్రకటించారు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆరో సీడ్ స్వితోలినా మ్యాచ్ జరుగుతున్న సమయంలో ప్లేయర్ బాక్స్‌లో కూర్చొని మోన్ఫిల్స్ ఆమెను ప్రోత్సహించడం కనిపించింది. దీనిపై ప్రశ్నించగా...‘అతను నా కోసమే, నాకు మద్దతునిచ్చేందుకే అక్కడికి వచ్చాడు. నేను కూడా అతని కోసమే ఉన్నాను. ఇప్పుడు మా మధ్య ఎలాంటి అనుబంధం ఉందో ఇద్దరికీ బాగా తెలుసు’ అంటూ స్వితోలినా తమ బంధాన్ని నిర్ధారించింది. తమ ఇద్దరి పేర్లు ‘గేల్ ఎలీనా మోన్ఫిల్స్ స్వితోలినా’లను కలుపుతూ వీరు ‘జీ.ఈ.ఎం.ఎస్ లైఫ్’ పేరుతో ఒకే ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను మొదలు పెట్టడం విశేషం. ఇందులో వారిద్దరు కలిసి ఉన్న వీడియోను కూడా పంచుకున్నారు. 7 ఏటీపీ టైటిల్స్ గెలిచిన 32 ఏళ్ల మోన్ఫిల్స్ ప్రస్తుతం 33వ ర్యాంక్‌లో ఉన్నాడు. 13 డబ్ల్యూటీఏ టైటిల్స్ సాధించిన 24 ఏళ్ల స్వితోలినా ప్రస్తుతం 7వ ర్యాంక్‌లో కొనసాగుతోంది. -
మూడో రౌండ్‌కు స్వితోలినా
∙ ముగురుజా, వీనస్, షరపోవా కూడా... ∙ వోజ్నియాకి, సోంగా ఔట్ ∙ యూఎస్ ఓపెన్ న్యూయార్క్: సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో ఉక్రెయిన్ స్టార్ ఎలినా స్వితోలినా, ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ జెలెనా ఒస్టాపెంకో మూడో రౌండ్లోకి ప్రవేశించారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో నాలుగో సీడ్ స్వితోలినా 6–4, 6–4తో ఎవ్‌జినియా రొడినా (రష్యా)ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో నాలుగు ఏస్‌లను సంధించిన ఉక్రెయిన్ ప్లేయర్ 29 విన్నర్స్ కొట్టింది. 28 సార్లు అనవసర తప్పిదాలు చేసింది. అయితే మూడు బ్రేక్ పాయింట్లను సాధించి మ్యాచ్‌ను వరుస సెట్లలో ముగించింది. మరో మ్యాచ్‌లో 12వ సీడ్ ఒస్టాపెంకో (లాత్వియా) 6–4, 6–4తో సొరానా సిర్స్టియా (రొమేనియా)పై విజయం సాధించింది. 23వ సీడ్ స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్) 1–6, 1–6తో జెన్నిఫర్ బ్రాడి (అమెరికా) చేతిలో ఓటమి చవిచూసింది. వోజ్నియాకి రెండో రౌండ్లోనే... మహిళల సింగిల్స్‌లో మాజీ నంబర్‌వన్, ఐదో సీడ్ వోజ్నియాకి (డెన్మార్క్) రెండో రౌండ్లోనే నిష్క్రమించింది. మూడో సీడ్ ముగురుజా (స్పెయిన్), షరపోవా(రష్యా), వీనస్ (అమెరికా) మూడో రౌండ్లోకి దూసుకెళ్లారు. రెండో రౌండ్లో కరోలినా వోజ్నియాకి 2–6, 7–6 (7/5), 1–6తో మకరోవా (రష్యా) చేతిలో కంగుతినగా... ముగురుజా 6–4, 6–0తో యింగ్ యింగ్ డువాన్ (చైనా)పై అలవోక విజయం సాధించింది. షరపోవా 6–7 (4/7), 6–4, 6–1తో టిమియా బబోస్ (హంగేరి)పై గెలుపొందగా, తొమ్మిదో సీడ్ వీనస్ విలియమ్స్ 7–5, 6–4తో ఒసియానె డొడిన్ (ఫ్రాన్స్)ను ఓడించింది. 13వ సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్) 6–1, 6–2తో కార్నెట్ (ఫ్రాన్స్)పై గెలుపొందగా... 14వ సీడ్ క్రిస్టినా ఎమ్లడెనోవిక్ (ఫ్రాన్స్) తొలిరౌండ్లోనే ఇంటిదారి పట్టింది. ఆమె 3–6, 2–6తో మోనిక నికులెస్కు (రొమేనియా) చేతిలో ఓడిపోయింది. సోంగా ఔట్ పురుషుల సింగిల్స్‌లో ఎనిమిదో సీడ్ జో విల్ఫ్రెడ్ సోంగా (ఫ్రాన్స్) రెండో రౌండ్లోనే కంగుతిన్నాడు. కెనడాకు చెందిన అన్‌సీడెడ్ షపొవలోవ్ 6–4, 6–4, 7–6 (7/3)తో సోంగాను మట్టికరిపించాడు. ఐదో సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా) 6–3, 6–3, 6–3తో ఫ్లొరియన్ మేయర్ (జర్మనీ)పై సునాయాస విజయం సాధించాడు. ముర్రే నిష్క్రమణతో లభించిన మెరుగైన సీడింగ్ అవకాశాన్ని నాలుగో సీడ్ జ్వెరోవ్ చేజార్చుకున్నాడు. ఈ జర్మనీ ఆటగాడు 6–3, 5–7, 6–7 (1/7), 6–7 (4/7)తో 61వ ర్యాంకర్ బొర్మా కొరిక్ (క్రొయేషియా) చేతిలో పరాజయం చవిచూశాడు.