ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్కతా | Kolkata Knight Riders, who chose to field | Sakshi
Sakshi News home page

ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్కతా

Apr 24 2016 8:04 PM | Updated on Sep 3 2017 10:39 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9లో భాగంగా పుణె సూపర్ జెయింట్స్తో జరుగుతున్న మ్యాచ్లో కోల్ కతా నైట్ రైడర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

పుణె:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9లో భాగంగా ఆదివారం పుణె సూపర్ జెయింట్స్తో జరుగుతున్న మ్యాచ్లో కోల్ కతా నైట్ రైడర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈరోజు మ్యాచ్ లో పుణె జట్టులో రెండు మార్పులు చోటు చేసుకోగా, కోల్ కతా ఒక మార్పుతో బరిలోకి దిగింది. గాయపడ్డ కెవిన్ పీటర్సన్, ఇషాంత శర్మ స్థానంలో సౌరభ్ తివారీ, ఆల్బీ మోర్కెల్లు పుణె తుది జట్టులోకి రాగా, కోల్ కతా జట్టు నుంచి మనీష్ పాండే  గాయం కారణంగా వైదొలగాల్సి వచ్చింది. అతని స్థానంలో రాజ్ గోపాల్ సతీష్ జట్టులోకి వచ్చాడు.

ఈ టోర్నీలో ఇప్పటివరకూ ఇరు జట్లు నాలుగు మ్యాచ్లు ఆడగా కోల్ కతా మూడింట్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా, పుణె ఒక దాంట్లో మాత్రమే గెలిచి చివరి నుంచి రెండో స్థానంలో ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement