6 అడుగుల 8 అంగుళాలు! | Jamieson Is New Member For New Zealand ODI Team | Sakshi
Sakshi News home page

6 అడుగుల 8 అంగుళాలు!

Jan 31 2020 4:10 AM | Updated on Jan 31 2020 4:10 AM

Jamieson Is New Member For New Zealand ODI Team - Sakshi

భారత్‌తో జరిగే వన్డే సిరీస్‌ కోసం న్యూజిలాండ్‌ తమ జట్టును ప్రకటించింది. ఇందులో అవకాశం దక్కించుకున్న పేస్‌ బౌలర్‌ కైల్‌ జేమీసన్‌పై ఇప్పుడు అందరి దృష్టీ నిలిచింది. జేమీసన్‌ ఎత్తు 6 అడుగుల 8 అంగుళాలు కావడం విశేషం. ‘టూ మీటర్‌ పీటర్‌’గా పిలిచే కివీస్‌ జట్టు బ్యాటింగ్‌ కోచ్‌ పీటర్‌ ఫల్టన్‌కంటే అతను ఎక్కువ (2.03 మీటర్లు) పొడగరి. జేమీసన్‌ ఇప్పటి వరకు అంతర్జాతీయ అరంగేట్రం చేయలేదు. గత ఏడాది ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు మ్యాచ్‌ దక్కలేదు. అయితే ‘ఎ’ జట్ల తరఫున మాత్రం రెగ్యులర్‌ సభ్యుడైన అతనికి దేశవాళీలో మంచి రికార్డు ఉంది. భారత ‘ఎ’ జట్టుతో ఇటీవల కివీస్‌ వన్డే సిరీస్‌ నెగ్గడంలో జేమీసన్‌ కీలక పాత్ర పోషించాడు.

Advertisement
 
Advertisement
Advertisement