కాంస్యం నెగ్గిన భారత హాకీ జట్టు | Indian hockey team won bronze | Sakshi
Sakshi News home page

కాంస్యం నెగ్గిన భారత హాకీ జట్టు

Nov 27 2016 11:33 PM | Updated on Sep 4 2017 9:17 PM

వర్గీకరణ మ్యాచ్‌లో ఆద్యంతం ఆధిపత్యం చలారుుంచిన భారత పురుషుల జట్టు నాలుగు దేశాల హాకీ టోర్నమెంట్‌లో కాంస్య ...

మెల్‌బోర్న్: వర్గీకరణ మ్యాచ్‌లో ఆద్యంతం ఆధిపత్యం చలారుుంచిన భారత పురుషుల జట్టు నాలుగు దేశాల హాకీ టోర్నమెంట్‌లో కాంస్య పతకాన్ని సాధించింది. మలేసియా జట్టుతో మూడు, నాలుగు స్థానాల కోసం ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 4-1 గోల్స్ తేడాతో గెలిచింది. భారత్ తరఫున ఆకాశ్‌దీప్ సింగ్ (2వ ని.లో), కెప్టెన్ రఘునాథ్ (45వ ని.లో), తల్విందర్ సింగ్ (52వ ని.లో), రూపిందర్ పాల్ సింగ్ (58వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... మలేసియా జట్టుకు జోయెల్ వాన్ హుజెల్ (45వ ని.లో) ఏకై క గోల్ అందించాడు.

మరోవైపు ఆస్ట్రేలియా మహిళల హాకీ జట్టుతో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 1-2తో కోల్పోరుుంది. ఆదివారం జరిగిన చివరిదైన మూడో మ్యాచ్‌లో టీమిండియా 1-3తో ఓడిపోరుుంది. భారత్ తరఫున మోనిక (30వ ని.లో) ఏకై క గోల్ చేసింది.

 

Advertisement
 
Advertisement
Advertisement