సెమీఫైనల్లో భారత్‌ | India in the semi finals of the Womens Nations Cup hockey tournament | Sakshi
Sakshi News home page

సెమీఫైనల్లో భారత్‌

Jun 17 2026 3:52 AM | Updated on Jun 17 2026 3:52 AM

India in the semi finals of the Womens Nations Cup hockey tournament

ఆక్లాండ్‌: మహిళల నేషన్స్‌ కప్‌ హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసింది. జపాన్‌ జట్టుతో గ్రూప్‌ ‘ఎ’ మ్యాచ్‌లో సలీమా టెటె సారథ్యంలోని భారత జట్టు 2–1 గోల్స్‌ తేడాతో గెలిచింది. ఈ విజయంతో భారత జట్టు మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే ఆరు పాయింట్లతో సెమీఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.

భారత్‌ తరఫున కెప్టెన్ సలీమా టెటె (33వ నిమిషంలో), లాల్‌రెమ్‌సియామి (49వ నిమిషంలో) ఒక్కో గోల్‌ సాధించారు. జపాన్‌ జట్టుకు అయ్‌ హిరామిత్సు (35వ నిమిషంలో) ఏకైక గోల్‌ అందించింది. ఈ మ్యాచ్‌తో భారత జట్టు మిడ్‌ఫీల్డర్‌ జ్యోతి తన కెరీర్‌లో 100 మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement