జయరామ్‌కు చుక్కెదురు | Indian challenge ends as Ajay Jayaram bows out of Indonesian Masters | Sakshi
Sakshi News home page

జయరామ్‌కు చుక్కెదురు

Sep 10 2016 12:54 AM | Updated on Sep 4 2017 12:49 PM

జయరామ్‌కు చుక్కెదురు

జయరామ్‌కు చుక్కెదురు

ఇండోనేసియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది.

న్యూఢిల్లీ: ఇండోనేసియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. బరిలో మిగిలిన ఏకై క ప్లేయర్ అజయ్ జయరామ్ క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయాడు. ఇండోనేసియాలోని బాలిక్‌పాపన్ పట్టణంలో శుక్రవారం ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 21వ ర్యాంకర్ జయరామ్ 12-21, 10-21తో ప్రపంచ 41వ ర్యాంకర్ యూకీ షి (చైనా) చేతిలో పరాజయం పాలయ్యాడు. 32 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్ ఆరంభంలో చైనా ప్లేయర్‌కు కాస్త పోటీనిచ్చిన జయరామ్ ఆ తర్వాత తడబడ్డాడు.ఈ టోర్నీలో భారత్ తరఫున పాల్గొన్న సారుుప్రణీత్, ప్రణయ్ మూడో రౌండ్‌లో, కశ్యప్ రెండో రౌండ్‌లో, సిరిల్ వర్మ, హర్షిల్ డాని, కౌశల్ తొలి రౌండ్‌లో ఓడిపోయారు. మహిళల సింగిల్స్‌లో రుత్విక శివాని, పీసీ తులసీ, తన్వీ లాడ్ తొలి రౌండ్‌లోనే వెనుదిరిగారు.

Advertisement
 
Advertisement
Advertisement