క్వార్టర్స్‌లో భారత్‌ | India Storm into Quarterfinals In Thomas and Uber Cup 2026 | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో భారత్‌

Apr 28 2026 5:38 AM | Updated on Apr 28 2026 5:38 AM

India Storm into Quarterfinals In Thomas and Uber Cup 2026

ఆస్ట్రేలియాపై 5–0తో క్లీన్‌స్వీప్‌

రేపు చివరి లీగ్‌ మ్యాచ్‌లో చైనాతో ‘ఢీ’

హోర్‌సెన్స్‌ (డెన్మార్క్‌): మాజీ చాంపియన్‌ భారత పురుషుల జట్టు థామస్‌ కప్‌ టీమ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో తొలి లక్ష్యాన్ని అందుకుంది. వరుసగా రెండో విజయంతో క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌ను అధికారికంగా ఖరారు చేసుకుంది. గ్రూప్‌ ‘ఎ’లో భాగంగా సోమవారం జరిగిన రెండో లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 5–0తో ఆ్రస్టేలియాను క్లీన్‌స్వీప్‌ చేసింది. గ్రూప్‌ ‘ఎ’లోని మరో మ్యాచ్‌లో చైనా 4–1తో కెనడాను ఓడించింది.

 రెండు విజయాలతో భారత్, చైనా జట్లు క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకోగా... రెండు ఓటములతో ఆ్రస్టేలియా, కెనడా జట్లు క్వార్టర్‌ ఫైనల్‌ రేసు నుంచి నిష్క్రమించాయి. భారత్, చైనా జట్ల మధ్య బుధవారం జరిగే చివరి లీగ్‌ మ్యాచ్‌లో గెలిచిన జట్టు గ్రూప్‌ విజేతగా నిలుస్తుంది. ఆ్రస్టేలియాతో జరిగిన పోటీలో తొలి మ్యాచ్‌లో లక్ష్య సేన్‌ 21–14, 21–16తో స్టీఫెన్‌ సామ్‌ను ఓడించాడు. రెండో మ్యాచ్‌లో ఆసియా చాంపియన్‌షిప్‌ రన్నరప్‌ ఆయుశ్‌ శెట్టి 21–8, 21–6తో షెరీ ధండ్‌పై గెలిచాడు. 

మూడో మ్యాచ్‌లో సాతి్వక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి 21–14, 21–16తో రిజ్కీ హిదాయత్‌–జాక్‌ యులపై గెలిచి భారత్‌కు 3–0తో విజయాన్ని ఖరారు చేశారు. నాలుగో మ్యాచ్‌లో హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ 21–11, 21–17తో రిషి హోండా భూపతిపై గెలిచి భారత ఆధిక్యాన్ని 4–0కు పెంచాడు. ఐదో మ్యాచ్‌లో హరిహరన్‌–ఎంఆర్‌ అరుŠజ్‌న్‌ 21–12, 21–10తో స్టీఫెన్‌ సామ్‌–అందికలపై గెలిచి టీమిండియాకు 5–0తో సంపూర్ణ విజయాన్ని కట్టబెట్టారు. 2022లో తొలిసారి థామస్‌ కప్‌ చాంపియన్‌గా నిలిచిన భారత జట్టు 2024లోనూ క్వార్టర్‌ ఫైనల్‌ చేరింది. అయితే చైనాతో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో భారత జట్టు 1–3తో ఓడిపోయింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement