పోరాడి ఓడిన భారత్ | India fought loss | Sakshi
Sakshi News home page

పోరాడి ఓడిన భారత్

Nov 26 2016 11:29 PM | Updated on Sep 4 2017 9:12 PM

న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిన భారత జట్టు నాలుగు దేశాల హాకీ టోర్నమెంట్‌లో టైటిల్ రేసు నుంచి వైదొలిగింది.

నాలుగు దేశాల హాకీ టోర్నీ 

మెల్‌బోర్న్: న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిన భారత జట్టు నాలుగు దేశాల హాకీ టోర్నమెంట్‌లో టైటిల్ రేసు నుంచి వైదొలిగింది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 2-3 గోల్స్ తేడాతో ఓటమి చవిచూసింది. ఈ పరాజయంతో భారత్ ఆదివారం మూడు, నాలుగు స్థానాల కోసం జరిగే వర్గీకరణ మ్యాచ్‌లో మలేసియాతో ఆడుతుంది. న్యూజిలాండ్‌తో జరిగిన పోరులో భారత్ తరఫున రూపిందర్ పాల్ సింగ్ (18వ, 57వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... న్యూజిలాండ్ జట్టుకు నిక్ రాస్ (47వ ని.లో), జాకబ్ స్మిత్ (48వ ని.లో), ఇంగ్లిస్ హుగో (57వ ని.లో) ఒక్కో గోల్ అందించారు. ఆదివారం జరిగే ఫైనల్లో న్యూజిలాండ్‌తో ఆస్ట్రేలియా తలపడుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement