భారత్ ఆలౌట్ 457, ఇంగ్లాండ్ 43/1 | India bowled out for 457 | Sakshi
Sakshi News home page

భారత్ ఆలౌట్ 457, ఇంగ్లాండ్ 43/1

Jul 10 2014 11:04 PM | Updated on Sep 2 2017 10:06 AM

భారత్ ఆలౌట్ 457, ఇంగ్లాండ్ 43/1

భారత్ ఆలౌట్ 457, ఇంగ్లాండ్ 43/1

పటౌడీ ట్రోఫిలో భాగంగా నాటింగ్ హమ్ లో ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో మొదటి ఇన్నింగ్స్ లో భారత జట్టు 457 పరుగులకు ఆలౌటైంది.

పటౌడీ ట్రోఫిలో భాగంగా నాటింగ్ హమ్ లో ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో మొదటి ఇన్నింగ్స్ లో భారత జట్టు 457 పరుగులకు ఆలౌటైంది. రెండవ రోజు ఆటలో ఓపెనర్ విజయ్ 146, కెప్టెన్ ధోని 82 పరుగులు చేసి అవుటవ్వగా, టెయిలెండర్స్ భువనేశ్వర్ కుమార్ 58, మహ్మద్ షమీ 51 పరుగులు చేయడం రెండవ రోజు ఆటలో విశేషం. అండర్సన్ కు 3, బ్రాడ్, స్టోక్స్ రెండేసి వికెట్లు, ప్లంకెట్, ఆలీకి చెరో వికెట్ దక్కింది.
 
ఆతర్వాత తొలి ఇన్నింగ్స్ ను ఆరంభించిన ఇంగ్లాండ్ జట్టు 9 పరుగుల వద్ద కెప్టెన్ కుక్ వికెట్ కోల్పోయింది. రెండవ రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 43/1 పరుగులు చేసింది. రోబ్సన్ 20, బాలెన్స్ 15 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్ షమీకి కుక్ వికెట్ దక్కింది. 

Advertisement
 
Advertisement
Advertisement